చంద్రబాబుకు కనువిప్పు కలగాలి

23 Mar, 2016 17:56 IST
అనంతపురంః రాష్ట్రంలో చంద్రబాబు అనైతిక,  అప్రజాస్వామిక, విలువలు లేని పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు.  బాబుకు ప్రజలు, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని ఫైరయ్యారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో బాబుకు చిత్తశుద్ది లేదని, ప్రభుత్వం రాజధాని అమరావతి భూదందా మత్తులో ముగిపోయిందని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాకంఠక పాలన సాగిస్తున్న చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించాలని కాపు రామచంద్రారెడ్డి భంభంస్వామి దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు.

ఉరుసు ఉత్సవాల్లో భాగంగా స్వామి సన్నిధిలో జీవ సమాధికి పూజలు చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ  రైతులు, డ్వాక్రా మహిళలు, చిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అంతేకాక రాష్ట్రానికి హోదా సాధించుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అసెంబ్లీలో ప్రజలగొంతుక అయిన ప్రతిపక్షాన్ని అణదొక్కడమే పనిగా ప్రభుత్వ ముందుకు పోతుందని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. 

సంక్షేమ పథకాల అమలులో కూడా కమిటీల పేరుతో పార్టీ కార్యకర్తలకే పెద్ద పీఠ వేసి అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. మరోవైపు కరువుకాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశఆరు. సాగునీటి ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. చంంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలు అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. అంతకుముందు ఆశ్రమ పీఠాధిపతులు అహ్మద్‌బాషా, వాహాబ్‌లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మాధవరెడ్డి పాల్గొన్నారు.