ప్రజల విశ్వాసం కోల్పోయిన బాబు

22 Sep, 2016 17:50 IST
హోదాను వేలంపాట పాడారు
ఏలూరు(యువ‌భేరి):  వేలం పాట మాదిరిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు అని కాంగ్రెస్ అంటే.... ప‌దేళ్ల‌ని బీజేపీ పాడింది... ప‌దిహేనేళ్లు అని చంద్ర‌బాబు పాట‌ప‌డ‌డంతో వేలంపాట బాబుకి ద‌క్కింద‌ని ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబిరెడ్డి అన్నారు. వేలంపాట‌లో పాడిన వ‌స్తువును తీసుకోక‌పోతే డిపాజిట్ కొల్పోయిన విధంగానే... చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కొల్పోయార‌న్నారు. 

కాబోయే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌
ఏలూరు(యువ‌భేరి): కాబోయే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అని డాక్ట‌ర్ కృష్ణ‌భ‌గ‌వ‌న్ అన్నారు. ఏలూరులో నిర్వ‌హించిన యువ‌భేరిలో ఆయ‌న మాట్లాడుతూ... 372 ఇంజ‌నీరింగ్ కాలేజీలున్నాయ‌ని, ఒక ప్రాజెక్టు చేయాలంటే మూడు, ఆరు నెల‌లు చేయాలి. ప్రాజెక్టులు చేయాలంటే ముఖ్యంగా ప‌రిశ్ర‌మ‌లుండాలి. ప‌రిశ్ర‌మ‌లున్నా త‌రువాత వ‌ర్క్ ఎక్సిరియ‌న్స్ రావాలంటే ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాలు కావాలి. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే ఆంధ్రప్ర‌దేశ్‌కు త‌ప్ప‌కుండా ప్ర‌త్యేక హోదా కావాలని ఆయ‌న పేర్కొన్నారు.