వ్యవసాయం అంటే బాబుకు చులకనభావం
23 Dec, 2016 13:21 IST
హైదరాబాద్ః వ్యవసాయాన్ని చంద్రబాబు చులకనభావంతో చూస్తున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నదుల అనుసంధానం అంటూ ఆర్భాటం చేస్తూ చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయంపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వచ్చాక రబీ సీజన్ లో ఏటా లక్ష హెక్టార్లకు పైగా పంట సాగు తగ్గుతోందని అన్నారు.