చంద్రబాబు ప్రజాభిమానం పూర్తిగా కొల్పోయారు.

17 Nov, 2018 11:20 IST
విజయనగరంః గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో టీడీపీ పాలనలో  జరుగుతున్న పరిణామాలు ప్రజలు అర్థం చేసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జీ శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల విలువలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు ప్రోదల్భంతోనే జరిగిందనడానికి ఏ మాత్రం సందేహాం లేదన్నారు. సీనియర్‌ నేతగా 40 ఏళ్లు అనుభవం ఉందన్న చెప్పుతున్న చంద్రబాబు వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన చంద్రబాబు ఆ వ్యవస్థనే వద్దు అంటూ చంద్రబాబు తీరుతో ప్రజల్లో అభిమానం పూర్తిగా కొల్పోయారని చెప్పారు.తనను తాను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం ఇది మంచిది కాదన్నారు.
 ,