అవినాష్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి పూచీకత్తులు

24 Sep, 2013 12:08 IST
హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2013:

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ కోసం‌ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం సొంత పూచీకత్తు సమర్పించారు. మంగళవారం ఉదయం జామీను పత్రాలతో అవినాష్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. పత్రాలను న్యాయమూర్తి పరిశీలించిన అనంతరం కోర్టు ఆర్డర్లు ఇవ్వనున్నది. కాగా, నాంపల్లి కోర్టు వద్దకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ కోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు వారినెవరినీ లోపలికి అనుమతించటం లేదు.

ఇలా ఉండగా.. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విడుదలకు సంబంధించిన జామీను పత్రాలను సమర్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు మంగళశారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. జామీను పత్రాలు పరిశీలించి శ్రీ జగన్‌ విడుదలకు సంబంధించిన ఆర్డర్సును కోర్టు ఇవ్వనున్నది. కోర్టు ప్రక్రియ ముగియడానికి సుమరు రెండు గంటల సమయం పడుతుంది.

కోర్టు ఆదేశాలు చంచల్‌గూడ జైలు అధికారులకు అందగానే శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల అవుతారు. నాంపల్లి సిబిఐ కోర్టు శ్రీ జగన్‌కు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు చే‌సిన విషయం తెలిసిందే. శ్రీ జగన్‌ విడుదలకు ఇద్దరి జామీన్‌దారులు రెండు లక్షల పూచీకత్తులను సమర్పించాలని కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.