వైయస్ జగన్‌ను హత్యచేయడానికే దాడి..
28 Oct, 2018 13:42 IST
రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టమైన వాస్తవాలు.
ఆపరేషన్ గరుడ స్పష్టికర్త చంద్రబాబే...
హత్యాయత్నంపై కుట్ర,సూత్రధారులను వెలికితీయాలి
వైయస్‌ఆర్‌సీసీ నేత జోగి రమేష్
విజయవాడః మూమ్మాటికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని హత్య చేయడానికే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టమయిందని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్ అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మెడమీద తగిలి ఉంటే చనిపోయేవారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తోందన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో వచ్చిన వాస్తవాలు చూసి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మీడియా ముందుకు వచ్చి వెకిలిచేష్టలతో మానవత్వం లేని ఒక మృగంలా ఏవిధంగా మాట్లాడారని మండిపడ్డారు. దాడిని చిన్న సంఘటనగా, చిన్న గాయ మని, చొక్కా చిరగలేదని, ఇదోక గేమ్ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఈ రిపోర్ట్‌పై ఏం సమాధానం చెప్పతారని దుయ్యబట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌లో విషపు కత్తితో దాడి జరిగితే డీజీపీ ప్రచార్భాటం అంటూ మాట్లాడారని వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి కోసం అంటూ నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడం దారుణమన్నారు. చంద్రబాబు, డీజీపీలు అవాస్తవాలు మాట్లాడినందుకు సిగ్గుతో లెంపలేసుకోవాలన్నారు. డీజీపీ పోలీసు వ్యవస్థకు అధిపతి అయి ఉండి, ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే నిజనిజాలు తెలుసుకోకుండా గంట తర్వాత మీడియా మీదకు వచ్చి అవాస్తవాలు ఎలా మాట్లాడతారని, కనీస విచారణ కూడా చేయకుండా ఒక టీడీపీ కార్యకర్తగా మాట్లాడటం దారుణమన్నారు. డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ పూరితగా పోలీసుల వ్యవస్థను నడపడంతో విఫలమయ్యారని మండిపడ్డారు. ఠాకూర్ డీజీపీగా పనికిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రతిపక్షనేత పై హత్యాయత్నం జరిగితే చౌకబారు మాటలు, వెలికితనంలో అవమాన పరిచారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడి దయతోనే జగన్ బయటపడ్డారని రాష్ట ప్రజలు ఆలయాలు,చర్చిలలో పూజలు,ప్రార్థనలు చేశారన్నారు. కాని చంద్రబాబు, మంత్రులంతా కత్తికట్టి నాటకంగా చిత్రీకరించారన్నారు. టీడీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. చంద్రబాబు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ ఢిల్లీకి పోయి శోకాలు పెడున్నాడని విమర్శించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేంచేంది చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. రాష్ట్రంలో అలజడులు స్పష్టించి సానుభూతి కోసవే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడని నిజస్వరూపం బట్టబయలు అయ్యిందన్నారు. ప్రజలు తమను గద్దె దింపడానికి నాలుగు నెలలే ఉందని, గ్రహించిన చంద్రబాబు నాయుడు కుట్రలు,కుత్రాంతాలు, అల్లరు చేయడానికి ప్రణాళికలు,వ్యూహా రచన చేస్తున్నారన్నారు. ఆరేషన్ గరుడని స్పష్టించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. శివాజీ మూడు నెలల క్రితం విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టి ఆపరేషన్ గరుడ ఎలా జరగబోతుందో చెప్పితే . పోలీసు వ్యవస్థ ఏమి చేసిందని చేతులు ముడుచుకుని ఉందా అని ప్రశ్నించారు. వ్యవస్థను భ్రష్టుపట్టించడానికి శివాజీని పావులుగా వాడుకుంటోందన్నారు. శివాజీ టీడీపీ తొత్తు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆపరేషన్ గరుడు గురించి శివాజీ చెప్పితే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పాలన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పె చంద్రబాబు నాయుడు చిన్నమెదడు చితికిపోయిందా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఖండించాల్సింది పోయి..పరామర్శించకుండా బురదచల్లడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో మసీదుల్లో, చర్చిల్లో, ఆలయాల్లో అల్లరు స్పష్టించి వేరే పార్టీలపై నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఆపరేషన్ గరుడ అంటూ చెప్పిన శివాజీని అరెస్ట్ చేసి విచారణ చేయించాలన్నారు. వైయస్ జగన్‌పై దాడిచేసిన శ్రీనివాస్‌రావు వెనుక పాత్రధారులు, సూత్రధారులు,కుట్రదారులెవరో వెలికితీయాలన్నారు. శ్రీనివాస్‌రావు తెలుగుదేశం క్రియాశీలక కార్యకర్తల అనే సంగతి ఆధారంతో సహా బయటపడిందన్నారు.