ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
10 Mar, 2016 15:06 IST
అసెంబ్లీః ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ శాసనసభలో వార్షిక, వ్యవసాయ బడ్జెట్ లను ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో నిరుద్యోగ భృతి, పెన్షన్ లు సహా రాష్ట్రంలోని అనేక ప్రజాసమస్యలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.