పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా కె. అనిల్ కుమార్

18 Jan, 2017 15:03 IST

కృష్ణా జిల్లాః పామర్రు నియోజకవర్గానికి సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన నియామకం చేపట్టింది.  వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పామర్రు నియోజకవర్గ సమన్వయకర్తగా కైలె అనిల్ కుమార్ ను పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.