అంగన్ వాడీల ఆందోళన..ప్రభుత్వంపై పెల్లుబికిన ఆగ్రహం

20 Nov, 2015 15:23 IST
ఏపీలో అంగన్ వాడీ వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. కొత్తగా పెంచిన జీతాల జీవో వెంటనే అమలు చేయడంతో పాటు, పాత బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.  వెంటనే తమ సమస్యలు నెరవేర్చాలన్నారు.  లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వర్కర్లు నిరనసకు దిగారు. వియనగరం జిల్లాలో పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్‌వాడీ లు ముట్టడించారు.  వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలకేంద్రంలో ర్యాలీ తీశారు. ఎండీఓ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు.  పెంచిన వేతనాలకు సంబంధించి జీవోను వెంటనే విడుదల చేయాలని, పదవీ విరమణ, పింఛను సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.