వైయస్‌ఆర్‌సీపీలోకి టిడిపి నాయకులు
31 Oct, 2012 10:21 IST
అనంతపురం: అనంతపురం మండలానికి చెందిన పలువురు కీలక టిడిపి నాయకులు మంగళవారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా పిల్లిగుండ్ల కాలనీలో జరిగిన బహిరంగసభలో వారంతా షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. టిడిపిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న విద్యారణ్యనగర్ వార్డు సభ్యుడు గోవిందరాజులు, మరికొందరు వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రూరల్ మండల కన్వీనర్ ధనుంజయ యాదవ్ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిల వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
నరసనాయునికుంట మాజీ సర్పంచి గోవిందనాయక్, టిడిపి నాయకులు పెద్ద పెద్దన్న, ఎర్ర నల్లప్ప, సురేష్, ఆనంద్ తదితరులు కూడా వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. పరిటాల రవీంద్ర హత్యానంతరం జరిగిన అల్లర్ల కేసులో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఎమ్మెల్యే పరిటాల సునీత తమను పట్టించుకోకపోవడంతో విసుగుచెంది తాము వైయస్‌ఆర్‌సీపీలోకి చేరినట్లు మాజీ సర్పంచి తదితరులు తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ నాయకుడు శ్యాంసుందర శాస్త్రి, వార్డు సభ్యుడు గోపాల్‌రెడ్డి, గోపీ, మాజీ సర్పంచ్‌లు సాకే ఆనంద్, రామలింగప్ప, సుబ్బన్న, రమణారెడ్డి, పెన్నోబులేసు, రమణ తదితరులు పాల్గొన్నారు.