సోమవారం నాడు ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు

24 Oct, 2015 18:32 IST

హైదరాబాద్ : పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. లేకపోతే, సోమవారం నాడు అంటే ఈ నెల 26న ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

 

ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దానికి అనుగుణంగా ఇక్కడ డీజిల్ ధరలు తగ్గుతున్నా కూడా ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావట్లేదని వైఎస్ఆర్   రాంబాబు విమర్శించారు. ప్రజలను దోచుకోవాలనే దృక్పథంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు


ఆర్టీసీని నడిపించే సామర్థ్యం ప్రభుత్వానికి లేకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు యాజమాన్యాలకు విచ్చలవిడిగా సహకరిస్తున్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం వల్ల ప్రైవేటు బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటే వాటివైపే ప్రయాణికులు మొగ్గు చూపుతారని ఆయన తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాలన్నీ చంద్రబాబుకు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు బినామీ సంస్థలేనని, అందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.