ఆమరణ దీక్ష శిబిరంలో అమరవీరుల ఫొటోలు
6 Apr, 2018 15:02 IST
ఢిల్లీ: ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల ఫొటోలు ఏర్పాటు చేశారు. శిబిరంలో అమరవీరులు రమణయ్య, లక్ష్మయ్య, లోకేశ్వరరావు, మునికోటి, ఉదయభాను ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలకు పార్టీ నాయకులు పూలమాలలు నివాళులర్పించారు. హక్కుల సాధనకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమే అని పార్టీ ఎంపీలు ఈ సందర్భంగా ఉద్ఘటించారు. అమరవీరుల ఫోటోలు దీక్ష శిబిరంలో స్ఫూర్తిని నింపుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎంపీలు నివాళులర్పించారు.