అక్రమ కేసులు బనాయంచటమే చంద్రబాబు లక్ష్యం..!
3 Aug, 2015 16:10 IST
కర్నూలు : ప్రతిపక్ష పార్టీల నేతలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ
కేసులు బనాయిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే భూమా
నాగిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని అక్రమ
కేసులు చూపించి అణచి వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. నంధ్యాల
సమగ్ర అభివృద్ది కోసం జరుగుతున్న పోరాటానికి ఆయన మద్దతు పలికారు.
ఎల్ల కాలం ఒకటే ప్రభుత్వం ఉండబోదని గుర్తించుకోవాలని ఆయన ప్రభుత్వ
యంత్రాంగానికి హితవు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు
తయారయ్యాయని ఆయన అన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని
భూమా స్పష్టం చేశారు.