అఖిలప్రియ రాజీనామా చేయాలి

4 Aug, 2017 11:00 IST

కర్నూలుః బహిరంగసభను విజయవంతం చేసిన నంద్యాల ప్రజలకు వైయస్సార్సీపీ ధన్యవాదములు తెలిపింది. శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం హర్షనీయమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మరో పార్టీలోకి వెళ్లేటప్పుడు రాజీనామా చేయడం నైతిక విలువలకు నిదర్శనమని అంబటి పేర్కొన్నారు. గతంలోనూ వైయస్సార్సీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించిన ఘన చరిత్ర వైయస్సార్సీపీదేనని అంబటి తెలిపారు. అప్పట్లో స్పీకర్ రాజీనామాలను ఆమోదించకపోతే పోరాటం చేసి ఆమోదింపజేసుకొని ఎన్నికలకు వెళ్లామన్నారు. కర్నూలు జిల్లాలో పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేల్లే ఏ ఒక్కరి చేతైనా రాజీనామా చేయించారా అని అంబటి ప్రశ్నించారు. ముందుగా అఖిలప్రియ, ఎస్పీ మోహన్ రెడ్డిలు రాజీనామా చేసి ఆ తర్వాత నంద్యాల ప్రజలను ఓట్లు అడగాలన్నారు. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేశాక ఆదినారాయణ రెడ్డి ప్రజలను ఓట్లు అడగాలని హితవు పలికారు.