అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి అనుమతి

14 Mar, 2016 10:44 IST

హైదరాబాద్) అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తెచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అడ్మిట్ అయింది. దీని మీద ఇప్పటికే ఎమ్మెల్యేలు సుజయ్ క్రిష్ణ రంగారావు, తదితరులు నోటీసుని స్పీకర్ కార్యాలయానికి సమర్పించారు. దీన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పరిగణనలోకి తీసుకొన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత దీనిపై ఓటింగ్ జరిపారు. నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల్లో పదో వంతు కన్నా ఎక్కువ మంది దీన్ని సమర్థించాలి. దీని మీద ఓటింగ్ లో వైఎస్సార్సీపీ సభ్యులంతా నుంచొని మద్దతు పలికారు. దీన్ని అంగీకరించిన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అడ్మిట్ చేసినట్లు ప్రకటించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ లో చర్చించిన తర్వాత దీనిపై ఎప్పుడు చర్చేంచేది సమయం, తేదీ నిర్ణయిస్తామని స్పీకర్ వెల్లడించారు.