అధికార, ప్రతిపక్షాలకు శరాఘాతం: మేకపాటి
26 Oct, 2012 12:33 IST
షర్మిల పాదయాత్రపై మేకపాటి
అనంతపురం:
మహానేత వైఎస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ కాంగ్రెస్, టీడీపీలకు శరాఘాతమని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. బుధ, గురువారాల్లో ఆయన షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. జననేత జగన్ జైలుకు వెళ్ళడానికి కారణం రెండు పార్టీలు సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా వారు పొందుతున్న ఆనందం తాత్కాలికమని చెప్పారు. రానున్న కాలంలో వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మేకపాటి వ్యాఖ్యానించారు.