అడ్డగుట్టలో బుధవారం విజయమ్మ రచ్చబండ
30 Apr, 2013 16:49 IST
హైదరాబాద్, 30 ఏప్రిల్ 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ బుధవారంనాడు సికింద్రాబాద్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆమె స్థానిక ప్రజలను కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మురికివాడల్లో నివసించే ప్రజలతో సమావేశం అవుతారు.