అభిరుచి మధును అరెస్టు చేయాలి
24 Aug, 2017 16:02 IST
కర్నూలు: శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులకు పాల్పడిన టీడీపీ నేత అభిరుచి మధును వెంటనే అరెస్టు చేయాలని నందికొట్కూరు, ఆదోని ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల ఘటనను వారు ఖండించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా టీడీపీ నేతల చేతుల్లోకి ఆయుధాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎలాంటి ప్రజాప్రతినిధి కాని రౌడీసీటర్ మధుకు గన్‌మెన్లను ఎందుకు కేటాయించారని నిలదీశారు. గుండాలు, రౌడీలు పట్టపగలే కత్తులతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. హత్యారాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు ఇంతలా వీరంగం సృష్టించడం ఎప్పుడు చూడలేదన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కత్తులతో వీరంగం చేయడం ఏంటని ప్రశ్నించారు.