ఆకుతోటపల్లి వద్ద షర్మిలకు అపూర్వ స్వాగతం

29 Oct, 2012 10:26 IST
ఎస్‌కే యూనివర్శిటీ:

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆకుతోటపల్లి గ్రామం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు షర్మిలకు అపూర్వ స్వాగతం పలికారు. మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం 12వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆమె యాత్రను ప్రారంభించారు. వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిలో పాలుపంచుకుంటున్నారు.  సోమవారం యాత్ర ఎస్ కే యూనివర్శిటీ నుంచి మొదలవుతుంది.  ఆకుతోటపల్లి, సెరీకల్చరల్‌ ఆఫీసు, ఐరన్‌ ఆఫీసు , సప్తగిరి సర్కిల్‌ సుభాష్‌ రోడ్డు, క్లాక్‌ టవర్‌ సెంటర్‌, కళ్యాణ్‌ దుర్గం సర్కిల్‌ల గుండా సాగుతుంది. చివరికి అనంతపురం శివార్లలో షర్మిల రాత్రి బసచేస్తారు.