50 కుటుంబాలు వైయస్ జగన్ సమక్షంలో చేరిక
30 Nov, 2016 10:26 IST
వైయస్ఆర్ కడపః జిల్లాలో వైయస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్దకొమెర్లకు చెందిన సుమారు 50 కుటుంబాలు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరాయి. మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన టీడీపీ నేత సిద్ధంరెడ్డి సంజీవరెడ్డితో పాటు మరిన్ని కుటుంబాలు నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీలో చేరారు. వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.