38వ రోజు పాదయాత్ర 15 కి.మీ.

23 Nov, 2012 18:06 IST
అలంపురం:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం నాడు మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో రోజుకు చేరుతుంది. 38వ రోజు యాత్ర శాంతినగర్ నుంచి ప్రారంభమవుతుందని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. 26వ కాల్వ వద్ద విరామం తీసుకుంటారు. విశ్రాంతి అనంతరం, కొంకాల, పెదతండ్ర క్రాస్, వెంకటాపురం స్టేజి వరకూ యాత్ర కొనసాగుతుందనీ, మొత్తం 15కిలోమీటర్లు సాగుతుందనీ ఆయన వివరించారు.