26న వైయస్ఆర్ సీపీ సమావేశం
24 Feb, 2017 20:50 IST
గుంటూరు(పెనమలూరు) : తాడిగడప గ్రామంలో ఈ నెల 26 సాయంత్రం ఐదు గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల కన్వీనర్ కిలారు శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశానికి నియోజకవర్గ కన్వీనర్ కొలుసు పార్థసారథి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో గ్రామ కమిటీ ఎన్నిక జరుగుతుందన్నారు.