118వ రోజు పాదయాత్ర ఆరంభం
12 Apr, 2013 10:22 IST
నూజివీడు, 12 ఏప్రిల్ 2013:
కృష్ణా జిల్లాలో శ్రీమతి వైయస్ షర్మిల 118వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని మోర్సపూడి నుంచి ఆమె శుక్రవారం ఉదయం యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి తుక్కులారు, నూజివీడు వరకూ యాత్ర సాగుతుంది. సాయంత్రం నూజివీడులో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల కిందటేడాది అక్టోబర్ 18న మరోప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.