షర్మిలకు 108 ఉద్యోగుల మొర
5 Jul, 2013 13:35 IST
విశాఖపట్నం 05 జూలై 2013:
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి వైయస్ షర్మిలను 108 సర్వీసుల ఉద్యోగులు శుక్రవారం ఉదయం కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆమెను కోరారు. విశాఖపట్నంలో శ్రీమతి షర్మిలను కలసి వారు తమ గోడును విన్నవించారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ 108 ఉద్యోగులు అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.