అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్‌తో కార్మికులకు భధ్రత
2 May, 2024 23:44 IST
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టి కార్మికులకు భధ్రత కల్పించారని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. అరకొర జీతాలు అంటూ ఆశా వర్కర్లు పై దారుణంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- చంద్రబాబు హయాంలో 6 వేల రూపాయలు మాత్రమే జీతం ఇచ్చారు.
- అరకొర జీతాలతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- వైయస్ జగన్ పాదయాత్ర సందర్భంగా తమ సమస్యలు ఏకరవు పెట్టారు
- వైయస్ జగన్ పాదయాత్ర తరువాత అధికారంలోకి రాగానే వారి విజ్ఞప్తి మేరకు 10 వేలు జీతం పెంచారు.
- దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆశా వర్కర్స్ కు 10 వేలు ఇవ్వటం లేదు
- డేటా ను కూడా ప్రభుత్వం అందిస్తుంది.. దీని వలన వారి వర్క్ కూడా ఈజి అయ్యింది
- ప్రజల ఆరోగ్య సమస్యలు ను క్షేత్ర స్థాయిలో పరిష్కారం అవుతుంది..
- పారిశుధ్యకార్మికులకు సైతం 22 వేలకు జీతాలు పెంచారు..
- ఇలాంటి అసత్య ప్రచారాలు కట్టి పెట్టాలి..
- అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టి కార్మికులకు భధ్రత కల్పించారు.
- చంద్రబాబుకు మధ్దతుగా పచ్చమీడియా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తోంది.
- జగన్ గారి ఆదరణ రోజురోజుకు పెరుగుతుండటంతో ఓటమి భయంతో చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు