జననేత యుద్ధానికి జగమంతా మద్దతు

28 Jan, 2018 13:23 IST
  • వైయస్‌ జగన్‌కు మద్దతుగా దేశ, విదేశాల్లో పాదయాత్ర
  • అన్న సీఎం కావాలని అభిమానుల పూజలు, ప్రార్థనలు




  • హైదరాబాద్‌: మోసకారి చంద్రబాబు పరిపాలనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న శాంతియుత యుద్ధానికి జనమంతా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజల సమస్యలు ఎరిగిన నాయకుడు, ప్రజల మనిషి జననేత వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆంధ్రరాష్ట్రం నమ్ముతోంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా మొదలైన ప్రజా సంకల్పయాత్ర మొదటి అడుగు 72వ రోజు ముగిసే సమయానికి 980.5 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను కడతేర్చేందుకు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోబోతున్న సందర్భంగా ఈ నెల 28, 29వ తేదీల్లో వాక్‌ విత్‌ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.




    పాదయాత్రకు మద్దతుగా...

    వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని పూర్తిచేసుకోబోతున్న సందర్భంగా దేశ విదేశాల నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్రకు పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. జగనన్నకు తోడుగా మేమంటూ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. వెయ్యి కిలోమీటర్ల పూర్తి సందర్భంగా మలేసియా, సింగపూర్, అమెరికా, షార్జా, కతార్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభిమానులు పాదయాత్ర చేపట్టారు. జననేత ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఆయా దేశాల్లో రెండు కిలోమీటర్ల మేర నడిచి మద్దతు ప్రకటించారు. వైయస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని పలువురు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో పాటు చెన్నైలో కూడా వైయస్‌ జగన్‌ పాదయాత్రకు పలువురు అభిమానులు మద్దతు ప్రకటించారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందని, తన స్వార్థ ప్రయోజనాల కోసం బాబు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని మండిపడుతున్నారు.