మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై న్యూజెర్సీలో నిర‌స‌న‌లు

10 Nov, 2025 15:31 IST

తాడేప‌ల్లి: ప్రభుత్వ మెడి కల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించే కూటమి ప్ర‌భుత్వ విధానాన్ని నిరసిస్తూ  ఆమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులు నిరసన తెలియజేశారు.  వైయ‌స్‌ఆర్‌సీపీ యూఎస్ కన్వీనర్ క‌డ‌ప ర‌త్నాక‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  వైయ‌స్ఆర్‌సీపీ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ చింత‌ల‌పూడి అశోక్‌కుమార్ పాల్గొని ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే వైయ‌స్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నిజం చేయడానికి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆయన తనయుడు వైయ‌స్ జగన్ 17 మెడికల్ కళాశాలలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.