విలేకరిపై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
17 Feb, 2025 14:59 IST
విజయనగరం : మక్కువ ప్రజాశక్తి విలేఖరి రామారావుపై టిడిపి నాయకుడి దాడిని జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యతిరేక వార్తలు రాసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దానికి వివరణ ఇవ్వాలని, లేదా ప్రకటన ద్వారా ఖండించాలి తప్ప, భౌతిక దాడులు సరైన మార్గం కాదని అన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటివని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు.