విజయనగరం జెడ్పీ 2వ వైస్ చైర్మన్ అంబటి అనిల్ హఠాన్మరణం
23 Oct, 2021 11:37 IST
విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయనగరం జిల్లా పరిషత్ 2వ వైస్ చైర్మన్ అంబటి అనిల్‌కుమార్ హఠాన్మరణం పొందారు. గత నాలుగు నెలలు క్రితం కోవిడ్ బారిన పడిన అంబటి.అనిల్ కుమార్ అదృష్టవశాత్తు కోవిడ్ మహమ్మారి నుంచి బయట పడి కోలుకున్నారు. ప్రస్తుతం పోస్టు కోవిడ్ లో శుక్రవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.