రేపు జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలువనున్న వైయస్ఆర్‌సీపీ ప్రతినిధులు
13 Aug, 2024 20:21 IST
తాడేపల్లి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ను కలవనుంది. విజయవాడలో సామాజిక న్యాయ శిల్పం అంబేద్కర్ స్మృతి వనంలో విధ్వంసం పై ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేయనుంది.
వైయస్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందంలో ఎంపీ గురుమూర్తి , మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.