నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన..

28 Mar, 2026 12:25 IST

నెల్లూరు: నగరంలో జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారీలు, వ్యాపారుల మధ్య రైతులు నష్టపోతున్నారని, వారికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వరి కోతలు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయమైన ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.