నేడు, రేపు వైయస్ఆర్‌సీపీ ప్లీనరీ..
8 Jul, 2022 09:59 IST
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైయస్ఆర్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8-9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైయస్ఆర్ ప్రాంగణంగా నామకరణం చేశారు.