వైయస్ జగన్ వినూత్న ఒరవడికి శ్రీకారం
14 Jun, 2019 11:57 IST
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గత పాలకుల అవినీతిపై ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. అవినీతి లేని పాలనను అందించాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అమ్మఒడి వంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారు. నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం. అవినీతి నిర్మూలనతో పాటు ప్రజాధనం దుబారా కాకుండా అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు.