కైకలూరు పోలీసు స్టేషన్ ఎదుట వైయస్ఆర్‌సీపీ నేతల ధర్నా
20 Nov, 2025 13:16 IST
కైకలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కైకలూరు నియోజకవర్గంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కైకలూరు మండల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు సింగంశెట్టి రామును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్ఆర్), పలువురు పార్టీ నేతలు పోలీసు స్టేషన్ ఎదుట భైటాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరు పై దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు.