‘ఎల్లుండి జాతీయ ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తాం’
12 Oct, 2025 19:11 IST
పార్వతీపురం మన్యం జిల్లా: పచ్చకామెర్లు సోసిక కురుపాం గిరిజన విద్యార్థుల వైద్క నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. ఎల్లుండి(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) వైయస్ఆర్‌సీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. హెపటైటస్ కేసులు ఇన్ని వస్తున్నా ఇప్పటివరకు గ్యాస్ట్రోఎంట్రలిజిస్ట్‌ను కురుపాం ఆస్పత్రికికి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అలాగే మిగతా హాస్టల్స్ విద్యార్థులకు వాక్సిన్ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. గిరిజనుల వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.