బాబును గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం

28 Feb, 2019 13:57 IST

విశాఖపట్నం: చంద్రబాబును గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. చోడవరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు. గర్జనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే. రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో కరణం ధర్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ.. ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.. సముద్రకెరటంలా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.