నూతన భవనంలోకి మారిన వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా కార్యాలయం
13 May, 2026 15:15 IST
అనంతపురం: నగరంలోని రెండో రోడ్డులో కొనసాగుతున్న వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయాన్ని హెచ్‌ఎల్‌సీ కాలనీలోని నూతన భవనానికి మార్చినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇకపై జిల్లా పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, సమావేశాలు, ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలు హెచ్‌ఎల్‌సీ కాలనీలోని నూతన కార్యాలయం నుంచే నిర్వహించబడతాయని వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొత్త కార్యాలయాన్ని గమనించి పార్టీ కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు.