మండలిలో వైయస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం
4 Mar, 2025 11:21 IST
అమరావతి: ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైయస్ఆర్‌సీపీ సభ్యులు కేజీఆర్ భరత్, బొమ్మి ఇశ్రాయేలు, వాయిదా తీర్మానం ఇచ్చారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించాలని శాసన మండలిలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్ హామీ ఇచ్చిన కూటమి నేతలు..9 నెలలు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, మెగా డీస్సీపైనా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, వైయస్ఆర్‌సీపీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు.