రోడ్డు ప్రమాదంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రాజు మృతి
9 May, 2025 16:02 IST

శ్రీసత్యసాయి జిల్లా: కుందుర్పి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరిగానపల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రాజు మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రాజు మృతదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం రాజు కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తలారి రంగయ్య అందించారు. రాజు కుటుంబానికి అన్ని విధాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తలారి రంగయ్య హామీ ఇచ్చారు.