వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్
8 Jul, 2020 11:21 IST
వైయస్ఆర్ జిల్లా : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. మహానేత జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్..పూలమాల వేసి తన తండ్రికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు.