వైయస్‌ఆర్ జిల్లాలో టీడీపీ నేతల అరాచకం..
25 Feb, 2019 11:44 IST
వైయస్‌ఆర్ జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టిన ఘటన కొండాపురం మండలం ఏటూరులో జరిగింది. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందినవారిని బూత్‌ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా.. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మా ప్రాణాలు పోయిన గాని వైయస్ జగన్ వెన్నంటే ఉంటామని, బూత్‌ల్లో ఏజెంట్లు చేరతామని వైయస్‌ఆర్‌సీపీ నేత అల్లం సత్యం స్టేట్‌మెంట్ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఆయన కారును దహనం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.