రేపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం
11 Feb, 2026 22:17 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం రేపు (12.02.2026) నిర్వహించనున్నారు. వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీకి చెందిన శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)తో సమావేశం కానున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తరఫున తీసుకోవాల్సిన వైఖరి, చర్చల నిర్వహణ విధానం తదితర అంశాలపై వైయస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.