కదలిక ఎడిటర్ ఇమామ్‌కు వైయస్ విజయమ్మ పరామర్శ
18 Dec, 2020 12:49 IST
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కదలిక ఎడిటర్ ఇమామ్‌ను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇమామ్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు శుక్రవారం విజయమ్మ ఆసుపత్రికి వెళ్లి ఇమామ్ ఆరోగ్యంపై వైద్యులతో ఆరా తీసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.