ప్రతాప్‌రెడ్డి అన్న.. త్వరగా కోలుకో: వైయస్ జగన్
25 Nov, 2025 11:08 IST
తాడేపల్లి: కావలి(నెల్లూరు) మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటీవలె బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రతాప్‌రెడ్డి అన్నా .. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు.