జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైయస్ జగన్
23 Apr, 2025 10:52 IST
తాడేపల్లి : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జమ్మూకశ్మీర్ దుర్ఘటనపై వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పహెల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.