నితిన్ గడ్కారికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
27 May, 2025 13:00 IST
తాడేపల్లి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి నిరంతర సేవ చేసేందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాలని వైయస్ జగన్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.