భక్తులకు వైయస్ జగన్ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు
26 Apr, 2026 16:59 IST
తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు.