రేపు వంశీని పరామర్శించనున్న వైయస్ జగన్
17 Feb, 2025 15:46 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో... కూటమి ప్రభుత్వ అక్రమ కేసులలో అరెస్ట్ అయి జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు.