రేపు రాప్తాడులో వైయస్ జగన్ పర్యటన
22 Nov, 2025 12:28 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (23.11.2025) అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు రాప్తాడు చేరుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు వైయస్ జగన్ హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.