నేడు కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
4 Nov, 2025 09:33 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, అక్కడే రైతులతో మాట్లాడునున్న వైయస్ జగన్. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉయ్యూర్ సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు